*బుల్లెట్ ట్రైన్ వచ్చే వరకు పోరాటం ఆగదు* *కౌన్సిలర్, డాక్టర్ ఊర రామ్మూర్తి*
సూర్యాపేట: సూర్యాపేటకు బుల్లెట్ ట్రైన్ వచ్చే వరకు తమ పోరాటం ఆగదని కౌన్సిలర్, డాక్టర్ ఊర రామ్మూర్తి అన్నారు. శుక్రవారం సూర్యాపేట జిల్లా కేంద్రంలో బుల్లెట్ ట్రైన్ కోసం అఖిలపక్షాల ఆధ్వర్యంలో బంద్కు పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... సూర్యాపేట మీదుగా బుల్లెట్ ట్రైన్ ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. ఈ డిమాండ్ సాధించే వరకు ఉద్యమాలను మరింత ఉద్ధృతం చేస్తామని తెలిపారు. బుల్లెట్ ట్రైన్ కోసం చేపడుతున్న ప్రజా ఉద్యమానికి అన్ని వర్గాల ప్రజలు మద్దతు ఇవ్వాలని కోరారు. ఈ కార్యక్రమంలో శ్రీధర్ బాబు, పత్తిపాక వేణుధర్, విద్యార్థి సంఘాల నాయకులు, తదితరులు పాల్గొన్నారు.